స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ అరెస్ట్‌  | Independent MP Pappu Yadav arrested in Patna in old case | Sakshi
Sakshi News home page

స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ అరెస్ట్‌ 

Feb 8 2026 5:09 AM | Updated on Feb 8 2026 11:40 AM

Independent MP Pappu Yadav arrested in Patna in old case

పాట్నా: బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌కు శుక్రవారం పటా్నలోని కోర్టు రెండు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించింది. 1995నాటి ఫోర్జరీ కేసులో ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆయనపై 2025 జూలైలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పోలీసులు శుక్రవారం రాత్రి మందిరి ప్రాంతంలోని నివాసంలో ఉన్న యాదవ్‌ను అరెస్ట్‌ చేసి, అదనపు జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ ఎదుట హాజరుపర్చారు. 

ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామన్న మేజి్రస్టేట్‌ రెండు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించారు. అయితే, పప్పూయాదవ్‌ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు లాయర్‌ తెలపడంతో అప్పటివరకు పట్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాలని ఆదేశించారు. 

స్వచ్ఛందంగా లొంగిపోతానని ఆయన చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను అరెస్ట్‌ చేశారని లాయర్‌ ఆరోపించారు. జెహానాబాద్‌కు చెందిన నీట్‌ అభ్యర్థి మృతి ఘటనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడమే తాజా పరిణామానికి కారణమన్న అనుమానాలున్నాయి. పప్పూ యాదవ్‌ అరెస్ట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ‘నీట్‌ అభ్యర్థిని మృతి విషయంలో న్యాయం కోరినందుకు, ప్రభుత్వం తీరును ప్రశ్నించినందుకే పప్పూ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇది కచి్చతంగా రాజకీయ కక్ష సాధింపే’అని పేర్కొన్నారు. 

నీట్‌ అభ్యరి్థని మరణం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉన్నట్లు దీన్నిబట్టి అవగతమవుతోందని వ్యాఖ్యానించారు. జెహానాబాద్‌కు చెందిన ఓ విద్యారి్థని పట్నాలోని చిత్రగుప్త నగర్‌ కాలనీలోని హాస్టల్‌లో అచేతన స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. కోమాలో ఉండగానే జనవరి 11వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని, అధికారులు ఈ విషయాన్ని బయపడకుండా కుట్ర పన్నారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై రాజకీయ దుమారం చెలరేగడంతో ఇటీవలే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement