బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని మహిళలను శక్తివంతం చేయడానికి , శక్తివంతం చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన "ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించనున్నామని ప్రకటించారు. క్యాబినెట్ సమావేశం తర్వాత సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే సోషల్ మీడియా ద్వారా వివరాలను పంచుకున్నారు. మహిళా రోజ్ గార్ పథకం ప్రాథమిక లక్ష్యం రాష్ట్రంలోని మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించడం, తద్వారా ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ తనను తాను వ్యవస్థాపకురాలిగా ఎదగాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి అవకాశాలను ప్రారంభించాలనుకునే రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.10 వేలు ప్రారంభ సహాయంగా అందిస్తున్నారు. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం కింద దీన్ని రూ. 2 లక్షల దాకా అందించేందుకు చర్యలు ప్రారంభించిందని తెలియజేసేందుగా సంతోషంగా ఉందని సీఎం ప్రకటించారు. దీని ప్రకారం లబ్ధిదారుల పని విధానాల మూల్యాంకనం ఆధారంగా పెంచిన సహాయం దశలవారీగా అందిస్తారు. మహిళలు ఉద్యోగం ప్రారంభించిన ఆరు నెలల తర్వాత చేసిన అంచనా ఆధారంగా ఈ పథకం కింద రెండు లక్షల రూపాయల వరకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
आप सभी को पता है कि हमलोगों ने राज्य की महिलाओं को सशक्त एवं आत्मनिर्भर बनाने के लिए ‘मुख्यमंत्री महिला रोजगार योजना’ प्रारंभ की है। इस योजना का मुख्य उद्देश्य राज्य की महिलाओं को स्वरोजगार के लिए आर्थिक सहायता प्रदान करना है, ताकि प्रत्येक परिवार की एक महिला उद्यमी के रूप में…
— Nitish Kumar (@NitishKumar) January 29, 2026
పనితీరు ఆధారిత ఆర్థిక సహాయం
ఈ పథకం కింద, మొదటి విడతగా రూ. 10,000 పొందిన మహిళలు, ఆ మొత్తాన్ని ఉపాధి ప్రారంభించడానికి ఎంత సమర్థవంతంగా ఉపయోగించా రనే దానిపై ఆధారపడి, ఆరు నెలల తర్వాత అదనపు సహాయానికి అర్హులు అవుతారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ ప్రారంభించామని, మునుపటి మొత్తాన్ని ఉపాధి కోసం సరిగ్గా ఉపయోగించినట్లయితే, ఈ మొత్తం దశలవారీగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాదు వ్యాపారాలు బాగా రాణిస్తోంటే, అవసరాన్ని బట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో కూడా మంజూరు చేయవచ్చని ఆయన తెలిపారు.
156 కోట్ల మంది మహిళలకు రూ. 10,000 బదిలీ
ఈ పథకిం కింద తొలి దశలో రూ 10 వేల చొప్పున ఇప్పటివరకు, కోటి 56 లక్షల మంది లబ్ధిదారులు డీబీటీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నారని సీఎం నితీష్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మిగిలి ఉన్న అర్హులైన దరఖాస్తుదారులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం త్వరలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బు అందుతుంది.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ ‘అప్‌స్క్రోల్డ్’ అసలేంటిది?
ఆరు నెలల సమీక్షా యంత్రాంగం
పథకం నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆరు నెలల తర్వాత వారి పనిని సమీక్షిస్తారు. ఈ మూల్యాంకనం ఆధారంగా, అవసరమైతే రూ. 2 లక్షల వరకు అదనపు సహాయం అందించబడుతుంది.
మార్కెటింగ్ మరియు ప్రభుత్వ అనుసంధానాలపై దృష్టి
లబ్ధిదారులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వం సంబంధిత విభాగాలను ఆదేశించింది. వీటిల్లో యూనిఫాం తయారీ, సుధా సేల్స్ సెంటర్లు ,దీదీ కి రసోయ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో లబ్ధిదారులను అనుసంధానించాలని వారికి సూచించామని నితీష్ కుమార్ అన్నారు. తద్వారా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడం, వలసలను అరికట్టడం, మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతోపాటు, రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం


