ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యాప్ అప్‌స్క్రోల్డ్ (UpScrolled) ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్,టిక్‌టాక్‌లాంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతోంది. అసలేంటీ అప్‌స్క్రోల్డ్, ఎందుకు పాపులర్ అవుతోంది? తెలుసుకుందాం.
ఎటాంటి సెన్సార్‌షిప్ లేదా దూకుడు అల్గారిథమ్‌లు లేని సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ప్రకటించుకుంటోంది యాజమాన్యం. యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది. దీంతో యాక్టివిస్టులు, రాజకీయవేత్తలు సహా పలువురు దీనివైపు మొగ్గు చూపుతున్నారు.
టాప్‌లో దూకుడు, ఏకంగా సర్వర్లు క్రాష్
ఆపిల్(iOS) యాండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా ఇది నిలిచింది. జనవరి 2026 నాటికి, అమెరికాలో ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్‌లో టాప్-10 లోకి చేరింది. టిక్‌టాక్ , మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్) లపై అసంతృప్తిగా ఉన్న యాక్టివిస్టులు, క్రియేటర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సార్‌షిప్‌లేని కంటెంట్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. పారదర్శకత ,న్యాయమైన కంటెంట్‌ను అందించే ప్లాట్‌పాం ప్రత్యామ్నాయాలన కోసం చూస్తున్నారు.
ఆపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో టిక్‌టాక్‌ను దాటేసింది. అంతేకాదు డౌన్‌లోడ్ల తాకిడికి జనవరి 26 న ప్లాట్‌ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్ యాజమాన్య మార్పు తర్వాత సెన్సార్‌షిప్ ఆరోపణల మధ్య టిక్‌టాక్‌ను వదిలివేసి అప్‌స్క్రోల్డ్‌కు మారిపోతున్నారు.
అప్‌స్క్రోల్డ్ ఎక్కడిది?
ఆస్ట్రేలియాకు చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. దీనిని పాలస్తీనా-ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ (Issam Hijazi) 2025,జూన్‌లో ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో టిక్‌టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో, చాలామంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు. దీని ‘‘ఎబౌట్" పేజీ ప్రకారం, పక్షపాతం, షాడోబ్యానింగ్ లేదా "అన్యాయమైన" అల్గారిథమ్‌ల ప్రమాదం లేకుండా యూజర్లందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే అప్‌స్క్రోల్డ్ లక్ష్యం.
కంపెనీ తమ మార్గదర్శకాలనుఉల్లంఘించే కంటెంట్‌ను మాత్రమే పరిమితం చేస్తుందట. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, అశ్లీలం, లైసెన్స్ లేని కాపీరైట్ కంటెంట్ లేదా "హాని కలిగించడానికి ఉద్దేశించినది". UpScrolled కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిషేధించదని అని కూడా చెపుతోంది. ప్లాట్‌ఫారమ్ ఉంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే, ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది.
ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గోరిథం. Discover Feedని ఉపయోగించవచ్చు డిస్కవర్ ఫీడ్, ఫాలోయింగ్ పీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్‌లను విభజిస్తుంది. Following Feed అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్‌లు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. Discover Feed అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్‌ను చూడవచ్చు.
ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం
డిస్కవర్ ఫీడ్ అనేది వివిధ రకాల కంటెంట్‌ల మిశ్రమం, కానీ ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించిన కంటెంట్‌తో నిండిపోతోంది. వాస్తవానికి, ప్రధాన స్రవంతి సోషల్ మీడియా యాప్‌లు ఈ రకమైన పోస్ట్‌లను సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణలకు ప్రతిస్పందనగా, చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను పాలస్తీనాకు మద్దతు ఇచ్చే కంటెంట్ కోసం దీన్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు క్రీడలు, వార్తలు, గేమ్‌లు, సినిమాలు, సంగీతం, టెక్నాలజీ , ట్రావెల్ వంటి అనేక విభిన్న రకాల కంటెంట్‌లను అందిస్తామని వెల్లడించింది. టిక్‌టాక్, ఇన్‌స్టాలా కాకుండా, Discover Feed కొన్ని దూకుడు, వ్యక్తిగతీకరించిన అల్గారిథమ్‌ను ఉపయోగించదు. దీనికి బదులుగా, ఇది లైక్‌లు, కామెంట్స్, షేర్స్ మీదధారపడి ఉంటుంది.

ముఖ్యమైన ఫీచర్లు
ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store, ఐఫోన్ (App Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇందులో ఫోటోలు, చిన్న వీడియోలు (Short-form videos) , టెక్స్ట్ పోస్ట్‌లను షేర్ చేయవచ్చు. స్నేహితులతో నేరుగా చాట్ చేసే సదుపాయం కూడా ఉంది.
ప్రధాన సోషల్ మీడియా సంస్థలు కొన్ని రకాల కంటెంట్‌ను (ముఖ్యంగా రాజకీయ అంశాలను) సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, "సెన్సార్‌షిప్ లేని ప్లాట్‌ఫారమ్"గా తనను తాను ప్రకటించుకుంది.
షాడో బ్యానింగ్ (Shadowbanning) అంటే యూజర్ల పోస్ట్‌లను రహస్యంగా అణచివేయడం ఉండదు. ఇతర యాప్‌లలాగా యూజర్లను అడిక్ట్ చేసే క్లిష్టమైన అల్గారిథమ్స్ కాకుండా, సాధారణమైన క్రోనలాజికల్ (సమయానుకూల) ఫీడ్‌ను ఇది అందిస్తుంది.
అయితే ఇది తన సేవా నిబంధనలను దూకుడుగా కొత్త ట్రాకింగ్‌తో అప్‌డేట్ చేస్తోందని, కొన్ని కంటెంట్ రకాలను బ్లాక్ చేస్తోందని, కొత్త పోస్ట్‌లను "షాడోబ్యాన్" చేస్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!


