మకర విలక్కు పండుగ సందర్భంగా శబరిమలలో ఆంక్షలు విధించారు. తాజా నిబంధనల ప్రకారం జనవరి 12 నుంచి పంబాలో ఎలాంటి వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు ఎలాంటి వాహనాలు ప్రయాణించడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు. అదే రోజు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదన తేల్చి చెప్పారు.
కాగా.. మకర సంక్రాంతికి అయ్యప్ప మాల భక్తులు పెద్దఎత్తున శబరిమల చేరుకుంటారు. మకరజ్యోతి దర్శనం కోసం వేలాది మంది అయ్యప్పస్వాములతో ఆలయం కిటకిటలాడుతుంది. అత్యంత రద్దీ ఉండే రోజులు కావడంతో భక్తులు వెళ్లే మార్గాల్లో వాహనాలకు అనుమతులు నిలిపేశారు. ఈ విషయాన్ని శబరిమల అయ్యప్ప భక్తులు గమనించాలని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


