మెట్రో పిల్లర్‌పై మార్జాలం  | Rescue saves cat trapped in Kochi Metro pillar | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్‌పై మార్జాలం 

Feb 23 2026 6:40 AM | Updated on Feb 23 2026 6:40 AM

Rescue saves cat trapped in Kochi Metro pillar

కష్టపడి కాపాడిన రెస్క్యూ బృందం 
 

కొచ్చి: కేరళలోని కొచ్చి నగరంలో మెట్రో రైల్వే పిల్లర్లపై ఒక చిన్న పిల్లి చిక్కుకుపోయింది. కొద్ది రోజుల క్రితం తొలిసారిగా ఒక ఆటో డ్రైవర్‌ దీనిని చూసి విషయం అధికారులకు చేరవేశాడు. అంతెత్తున్న పిల్లర్‌ నుంచి కిందకు రాలేక, ఆకలికి అక్కడే ఉండలేక అవస్థలు పడుతున్న పిల్లిని వెంటనే కాపాడాలని కోరారు. విషయం రంగంలోకి దిగిన కొచ్చి అగి్పమాపిక సిబ్బంది పలు మార్లు విఫలయత్నం చేసి ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి పిల్లిని పట్టుకుని పిల్లర్‌ నుంచి కిందకు దింపారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ చూసేందుకు గుమిగూడిన జనం ఆనందంతో కేరింతలు కొట్టారు. సంబంధిత ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  

పిల్లిని పట్టుకున్నారిలా.. 
కొచ్చిలోని కలూర్‌ ప్రాంతంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్‌ పిల్లర్ల మీద పిల్లి ఎటుపోవాలో తెలీక అటూ ఇటూ తిరుగుతోందని ఒక రిక్షా డ్రైవర్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం అధికారులు తొలిసారిగా రెస్క్యూ ఆపరేషన్‌కు ప్రయతి్నంచి విఫలమయ్యారు. అయితే ఎలాగైనా సరే పిల్లిని కాపాడాలని జంతువులపై క్రూరత్వ నిరోధక సంఘం(ఎస్‌పీసీఏ) శనివారం మరోమారు అధికారులకు మొరపెట్టుకుంది. 

దీంతో మళ్లీ అగి్నమాపక సిబ్బంది మరోమారు ప్రయతి్నంచగా భయంతో పిల్లి గిర్డార్‌ మధ్యలోని సందులోకి వెళ్లి దాక్కుంది. దీంతో అక్కడిదాకా హైడ్రాలిక్‌ క్రేన్‌ వెళ్లలేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ మరోసారి విఫలమైంది. అడ్డుగా మెట్రో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఉన్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌(కేఎంఆర్‌ఎల్‌)ను విజ్ఞప్తిచేశారు. 

వీళ్ల మొర కేఎంఆర్‌ఎల్‌ ఆలకించి ఒక 15 నిమిషాలపాటు మెట్రో సేవలను ఆపేసి విద్యుత్‌ సరఫరాను స్తంభింపజేసింది. అయితే ఆ సమయంలో పిల్లి ఎటుపోయిందో ఎవరికీ కనిపించలేదు. దీంతో ఈసారి వాళ్లు విఫలమయ్యారు. కొద్దిరోజులుగా తినడానికి తిండిలేక అది నీరసంగా కన్పించింది. దీంతో దానికి ఆహారంగా కొన్ని ఫుడ్‌ ప్యాకెట్లను అధికారులు పిల్లర్ల మీదకు చేర్చారు. ఇటీవల కేరళలో ఘన విజయం సాధించిన మంజుమ్మల్‌ బాయ్స్‌ సినిమాలో తమిళనాడులోని గుణ గుహల్లో చిక్కుకుపోయిన సుభాష్‌ అనే పాత్రధారి పేరును ఆటో డ్రైవర్లు ఈ పిల్లికి పెట్టారు. దీంతో సుభా‹Ùను ఎలాగైనా కాపాడాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 

దీంతో ఎలాగైనాసరే ఈసారి పిల్లిని పట్టుకోవాలని అగ్నిమాపక సిబ్బంది కంకణం కట్టుకుని మరీ పిల్లర్ల మీదకు చేరారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. పట్టుకున్నాక పెట్టడానికి ఒక బాక్స్, పట్టుకోవడానికి ఒక వలతో అన్వేషణ మొదలెట్టారు. వాళ్ల శ్రమ ఫలించి పిల్లి కని్పంచింది. వెంటనే దానిని జాగ్రత్తగా పట్టుకుని కిందకు తీసుకొచ్చారు. ఇదంతా ఉత్కంఠభరితంగా చూసిన స్థానికులు, జంతు ప్రేమికులు ఆనందంతో అధికారుల అనుకూల నినాదాలు చేశారు. వాళ్ల కృషిని మెచ్చుకున్నారు. నగరంలో ఇలా మెట్రో పిల్లర్‌పై పిల్లిని కాపాడటం ఇది మూడోసారి అని గాంధీనగర్‌ స్టేషన్‌లో ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సరీ్వస్‌ అధికారి చెప్పారు. ‘‘మెట్రోస్టేషన్‌ నుంచి అది పొరపాటున పిల్లర్‌పై పడి ఉంటుంది. మెట్రో రైల్‌ అధికారుల సహకారంతోనే విజయం సాధించాం’’అని అధికారి చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement