భార్య, భర్త మధ్యలో హెడ్‌ కానిస్టేబుల్‌..! | Constable Mohan Assault On Widow Swathi | Sakshi
Sakshi News home page

భార్య, భర్త మధ్యలో హెడ్‌ కానిస్టేబుల్‌..!

Feb 24 2026 11:57 AM | Updated on Feb 24 2026 12:28 PM

Constable Mohan Assault On Widow Swathi

వివాహిత ఆత్మహత్య.. పోలీసుపై కేసు 

కర్ణాటక: శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలోని హొస సిద్ధాపురలో స్వాతి (27) అనే వివాహిత ఆత్మహత్య కేసులో స్థానిక మాలూరు హెడ్‌ కానిస్టేబుల్‌ మోహన్‌పై కేసు దాఖలైంది. ప్రభుత్వ క్లర్కు అయిన ఆమె భర్త జగదీష్‌ శివరాత్రి రోజున ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి కారణం స్వాతి అని మోహన్‌ తప్పుడు ప్రచారం చేసి, ఆమెను మానసికంగా వేధించాడని, అందువల్ల ప్రాణాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. స్వాతి తల్లి భద్రావతి న్యూటౌన్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ నిఖిల్‌ ఆదేశాలతో నిందితునిపై కేసు నమోదు చేశారు. కేసులో నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు! 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement