కడు పేదరికం నుంచి మేయర్‌ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్‌ | Meet Nithya Raman After Mamdani Indian origin steals spotlight | Sakshi
Sakshi News home page

కడుపేదరికం నుంచి మేయర్‌ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్‌

Feb 23 2026 3:57 PM | Updated on Feb 23 2026 4:03 PM

Meet Nithya Raman After Mamdani Indian origin steals spotlight

న్యూయార్క్‌ మేయర్‌గా  భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు  భారత్‌కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్  మేయర్‌ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్‌  ఎవరు? ఆ వివరాలు మీకోసం.

లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు.  ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. 

కేరళలోజన్మించారు నిత్య రామన్.  ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య‌  కుటుంబం,  అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల  నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.

ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు.  2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

కరెన్ బాస్‌కు గట్టి పోటీ
ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. 

ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!

Advertisement
 
Advertisement
Advertisement