బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బంగ్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ బైరాగి (38) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ఏఎస్పీ అబుల్ బసర్ వెల్లడించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలోని మోనిరాంపూర్ ఉపజిల్లాలో జరిగింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. కాగా.. ప్రతాప్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని.. అతడు నరైల్ జిల్లా నుంచి వెలువడే ఓ దిన పత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సదరు పత్రిక న్యూస్ ఎడిటర్ అబుల్ మాట్లాడారు. రాణా ప్రతాప్ తమ పత్రిక సంపాదకుడని తెలిపారు. ఒకప్పుడు అతడిపై పలు కేసులు ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డారని వెల్లడించారు. అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు.
#BreakingNews: Another Hindu youth killed in Bangladesh!
A Hindu youth named Rana Pratap Bairagi was shot dead by miscreants in Monirampur upazila under Jessore district in Bangladesh. The incident took place today at noon today. pic.twitter.com/MlewUvcz0i— Salah Uddin Shoaib Choudhury (@salah_shoaib) January 5, 2026


