వ‌ర‌ల్డ్‌లోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్టు ఏదో తెలుసా?, హీత్రూ కాదు! | Incheon Airport Surpasses Heathrow To Become World Busiest | Sakshi
Sakshi News home page

అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఇంచియాన్‌

Aug 14 2026 7:03 PM | Updated on Aug 14 2026 7:20 PM

Incheon Airport Surpasses Heathrow To Become World Busiest

లండన్‌ హిత్రూను అధిగమించిన దక్షిణ కొరియా విమానాశ్రయం

సియోల్‌: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా దక్షిణ కొరియా ఇంచియాన్‌ విమానాశ్రయం అవతరించింది. ఆ స్థానంలో ఉన్న లండన్‌లోని హీత్రూ విమానాశ్రయాన్ని అధిగమించింది. ఇది అగ్రస్థానాన్ని పొందడం ఇదే మొదటిసారి. సేవా నాణ్యతలో వరుసగా 12వ ఏడాది కూడా అగ్రగామి విమానాశ్రయంగా నిలిచిన ఇంచియాన్, ఈ కొత్త బిరుదుతో అగ్రశ్రేణి గ్లోబల్‌ హబ్‌ విమానాశ్రయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సమా చారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,234 విమానాశ్రయాలలో ఇది అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను నిర్వహించింది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 38.4 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందించింది. లండన్‌ హీత్రూ విమానాశ్రయం 37.79 మిలి యన్ల ప్రయాణికులతో రెండో స్థానంలో, సింగపూర్‌ చాంగీ విమానాశ్రయం 34.53 మిలియ న్లతో మూడవ స్థానంలో నిలిచాయి.

2024, 2025ల్లో రెండో స్థానంలో నిలిచిన దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈసారి మొదటి ఐదు స్థానాల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్‌ మధ్య సంఘర్షణ కారణంగా దక్షిణాసియాలోని విమానయాన కేంద్రాల నుంచి ప్రయాణికులు మళ్లడం కూడా తమ స్థానం మెరుగుపడటానికి పాక్షికంగా కారణమని ఇంచియాన్‌ విమానాశ్రయం పేర్కొంది. గతంలో యూరప్‌కు వెళ్లేందుకు దుబాయ్‌ మీదుగా ప్రయాణించే వారు ఇప్పుడు ఇంచియాన్‌ మీదుగా ప్రయాణిస్తున్నారని, దీనివల్ల గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ట్రాన్స్‌ఫర్‌ ప్రయాణికుల సంఖ్య 18% పెరిగిందని విమానాశ్రయ కార్పొరేషన్‌ తెలిపింది. 

చ‌దవండి: బ్రిట‌న్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement