ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్ల  ఎయిర్‌లైన్స్‌ నిర్వహణపై నో బ్యాన్‌  | No policy bars airport operators from owning airlines | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్ల  ఎయిర్‌లైన్స్‌ నిర్వహణపై నో బ్యాన్‌ 

Aug 11 2026 4:50 AM | Updated on Aug 11 2026 4:50 AM

No policy bars airport operators from owning airlines

రాజ్యసభలో ప్రభుత్వం స్పషీ్టకరణ 

న్యూఢిల్లీ: విమానాశ్రయాల ఆపరేటర్లు.. విమానయాన సంస్థలను నడపకూడదంటూ పాలసీలపరంగా ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నడిచే ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించిన ఒప్పందాల్లో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మహోల్‌ సోమవారం రాజ్యసభకి ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఎయిర్‌పోర్ట్స్‌ ఆపరేటర్లు .. విమానయాన సంస్థల్లో గణనీయంగా వాటాలు తీసుకోకుండా లేదా వాటిని నడపకుండా ప్రస్తుతం ఏవైనా నిబంధనలు ఉంటే, వాటిని సడలించాలనే యోచనేదైనా ప్రభుత్వానికి ఉందా అని సీపీఐ(ఎం) సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ వివరణ ఇచ్చారు.  ప్రస్తుతం ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్‌.. ఎయిర్‌లైన్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉందని వార్తలు వచి్చన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు ఎయిర్‌లైన్‌ వ్యాపారంలోకి ప్రవేశించే యోచనేదీ లేదని అదానీ గ్రూప్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement