రూ.13.99 లక్షల బైక్.. ఇండియాలో లాంచ్! | 2026 Ducati Monster V2 Launched At Rs 13 99 Lakh | Sakshi
Sakshi News home page

రూ.13.99 లక్షల బైక్.. ఇండియాలో లాంచ్!

Aug 10 2026 7:44 PM | Updated on Aug 10 2026 7:53 PM

2026 Ducati Monster V2 Launched At Rs 13 99 Lakh

డుకాటి తన సరికొత్త మాన్‌స్టర్ వీ2ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు(ఎక్స్-షోరూమ్).ఈ కొత్త బైక్, దాని మునుపటి మోడల్ కంటే కొంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ ఇంజిన్, తేలికైన ఛాసిస్, మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది.

డుకాటీ ఇప్పుడు సరికొత్త 890 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ద్వారా 9,000 rpm వద్ద 111 హార్స్ పవర్, 7,250 rpm వద్ద 91.1 Nm టార్క్‌ అందిస్తుంది. ఇన్‌టేక్ వేరియబుల్ టైమింగ్ (IVT) సిస్టమ్‌ ఇందులో ఉంటుంది. ఈ సిస్టమ్ ఇంజన్ పరిధిని విస్తృతం చేయడంతో పాటు, పవర్ డెలివరీని సున్నితంగా చేసి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

2026 డుకాటీ మోడల్ చెప్పుకోదగ్గ స్థాయిలో అప్డేటెడ్ డిజైన్ పొందలేదు. కానీ బాడీవర్క్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్‌ను కొంత మార్చారు. బాడీ ప్యానెళ్లను సూక్ష్మంగా సవరించారు. రైడర్‌కు మరింత దృఢమైన రైడింగ్ పొజిషన్‌ను అందించే లక్ష్యంతో డుకాటి హ్యాండిల్‌బార్లను కూడా కొద్దిగా ముందుకు జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement