టీవీఎస్ మోటార్ కంపెనీ రైడర్ 125 డాక్టర్ డూమ్ ఎడిషన్‌ను రూ.95,320 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఇప్పటికే ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, డెడ్‌పూల్, వోల్వరైన్ థీమ్‌లతో కూడిన మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న రైడర్ సూపర్ స్క్వాడ్ శ్రేణిని ఈ సరికొత్త మోడల్ మరింత విస్తరిస్తుంది. అంటే కొత్త థీమ్ కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని సంస్థ దీనిని విడుదల చేసింది.
డాక్టర్ డూమ్ ఎడిషన్ స్పెక్ట్రల్ గ్రీన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితులలో ఆకుపచ్చ నుంచి గోధుమ రంగులోకి మారే కలర్ షిఫ్టింగ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే.. ఇతర సూపర్ స్క్వాడ్ రైడర్ మోడళ్ల మాదిరిగానే, దీని ఫ్యూయల్ ట్యాంక్ అండ్ సైడ్ ప్యానెళ్లపై కూడా డాక్టర్ డూమ్ గ్రాఫిక్స్ ఉంటాయి.
డిజైన్ పరంగా కొత్తగా అనిపించినప్పటికీ.. మెకానికల్‌గా ఏమీ మారలేదు. ఈ మోటార్‌సైకిల్ 124.8cc, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తూనే ఉంది. ఇది 11 bhp పవర్, 11.75 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.
ఫీచర్ల జాబితాలో కూడా ఎలాంటి మార్పు లేదు. అయితే రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్‌లో.. కనెక్టెడ్ ఫంక్షన్లతో కూడిన టీవీఎస్ కనెక్టెడ్ రివర్స్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. టాప్ స్పెక్ సూపర్ స్క్వాడ్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ బైక్.. రానున్న రోజుల్లో అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి వస్తుంది.


