రూ.47.99 లక్షల హోండా కొత్త కారు లాంచ్! | Honda ZR V Hybrid SUV Launched at Rs 47 99 Lakh | Sakshi
Sakshi News home page

రూ.47.99 లక్షల హోండా కొత్త కారు లాంచ్!

Jul 25 2026 4:03 PM | Updated on Jul 25 2026 4:15 PM

Honda ZR V Hybrid SUV Launched at Rs 47 99 Lakh

హోండా కంపెనీ తన ZR-V e:HEVని భారతదేశంలో రూ.47.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఈ కారు కోసం మే నెల నుంచి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి. సంస్థ దీనిని జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి చేస్తుంది.

కంపెనీ లాంచ్ చేసిన ZR-V e:HEV మొదటి రెండు బ్యాచ్‌లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయినట్లు సమాచారం. సంస్థ ఇండియన్ మార్కెట్ కోసం రూ.160 యూనిట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. ధర ఎక్కువైనా హోండా కారుకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

హోండా ZR-V 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జత చేయబడ్డాయి. ఇది 5,000-6,000 rpm వద్ద 181 Bhp పవర్, 0-2,000 rpm వద్ద 315 Nm టార్క్ అందిస్తుంది. పవర్ అనేది e-CVT ద్వారా ముందు చక్రాలకు వెళుతుంది. బ్యాటరీ రీజెనరేషన్ కోసం ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.

ఈ హైబ్రిడ్ మోడల్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, దీని గరిష్ట వేగం 172 కిలోమీటర్లు అని హోండా పేర్కొంది. మైలేజ్ మాత్రం లీటరుకు 22.79 కిలోమీటర్లు అని కూడా కంపెనీ తెలిపింది. ఇది ట్వైలైట్ మిస్ట్ బ్లాక్ పెర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ అనే రంగులలో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement