526 కిమీ రేంజ్ అందించే కొత్త కారు లాంచ్! | Kia Syros EV Launched at Rs 13 49 Lakh | Sakshi
Sakshi News home page

526 కిమీ రేంజ్ అందించే కొత్త కారు లాంచ్!

Jul 23 2026 7:16 PM | Updated on Jul 23 2026 7:35 PM

Kia Syros EV Launched at Rs 13 49 Lakh

కియా కంపెనీ భారతదేశంలో సైరోస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది . ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్‌లతో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.49 లక్షలు, రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే దీనిని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో రూ.7.99 లక్షల ప్రారంభ ధరలో కొనుగోలు చేయవచ్చు.

సైరోస్ ఈవీ, కే1 ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన కియా డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్‌లైట్లతో కూడిన ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ కారు 17-అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ 30-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లేతో వస్తుంది, ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్ ఉంటాయి. ఈ ఈవీ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 4వే పవర్ డ్రైవర్ సీట్, స్లైడింగ్, రిక్లైనింగ్ వెనుక సీటు, డాష్‌క్యామ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

సైరోస్ ఈవీలోని 42 kWh, 51.4 kWh బ్యాటరీలు.. వరుసగా 443 కి.మీ, 526 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. కాగా కంపెనీ 15 సంవత్సరాలు / అపరిమిత కిలోమీటర్ల జీవితకాల బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఇదే సమయంలో కియా 3 సంవత్సరాల తర్వాత 80% వరకు రీసేల్ విలువను అందించే అష్యూర్డ్ బైబ్యాక్ పథకాన్ని కూడా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement