పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే! | Tesla Launches Balance Bike for Kids | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే!

Jul 18 2026 8:03 PM | Updated on Jul 18 2026 8:26 PM

Tesla Launches Balance Bike for Kids

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టెస్లా (Tesla) ఇప్పుడు పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాలెన్స్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

నిజానికి టెస్లా కంపెనీ.. పెద్దవాళ్లకు ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేస్తుందని చాలామంది ఎదురుచూశారు. కానీ సంస్థ మాత్రం చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈవీ సైకిల్ విడుదల చేసింది. ఈ బ్యాలెన్స్ బైక్‌ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించారు.

టెస్లా బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్, చైన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ వంటివి ఉండవు. కేవలం పిల్లలు తమ కాళ్లతో బైక్‌ను ముందుకు కదిలిస్తూ బ్యాలెన్స్, హ్యాండిల్ తిప్పడం నేర్చుకునేలా తయారు చేశారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో మెగ్నీషియం అల్లాయ్ ఫ్రేమ్ ఉపయోగించడం వల్ల పిల్లలు సులభంగా నడపగలరు. బైక్‌పై టెస్లా లోగో, ముందు భాగంలో కంపెనీ గుర్తు కూడా ఉన్నాయి.

ఈ బైక్ ధర 225 డాలర్లు (సుమారు రూ.20 వేలు). సాధారణ పిల్లల బ్యాలెన్స్ బైక్‌లతో పోలిస్తే దీని ధర కొంత ఎక్కువే. అయితే ప్రీమియం బ్రాండ్ల బైక్‌లతో పోలిస్తే.. టెస్లా ధర కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ సీటు ఎత్తును పిల్లల పెరుగుదలకు అనుగుణంగా ఐదు రకాలుగా మార్చుకునే సౌకర్యం ఉంది. గరిష్టంగా 35 కిలోల బరువు ఉన్న పిల్లలు దీనిని ఉపయోగించవచ్చు. బైక్‌ను అసెంబుల్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్ కూడా ప్యాకేజీలో అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement