2026 క్లాసిక్ 350 లాంచ్: ధర ఎంతంటే? | 2026 Royal Enfield Classic 350 Launched at Rs 1 87 Lakh | Sakshi
Sakshi News home page

2026 క్లాసిక్ 350 లాంచ్: ధర ఎంతంటే?

Jul 16 2026 5:33 PM | Updated on Jul 16 2026 6:17 PM

2026 Royal Enfield Classic 350 Launched at Rs 1 87 Lakh

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విఫణిలో అప్‌డేటెడ్ క్లాసిక్ 350ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,87,434 (ఎక్స్-షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎడిషన్ రెండు ప్రధాన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ బైక్‌లో ఇప్పుడు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అమర్చారు. అదనపు సౌలభ్యం కోసం బైక్ తయారీదారు USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ సెటప్‌లో ఎలాంటి మార్పు లేదు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

కొత్త క్లాసిక్ 350లో 349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 20.2 Bhp పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజన్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement