ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. టైరాన్ లైనప్‌లో కొంత తక్కువ ధరలో ఉండే ఐదు సీట్ల ఎంట్రీ లెవల్ మోడల్ 'టైరాన్ లైఫ్'ను రూ. 41.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఆర్-లైన్ (రూ. 46.99 లక్షల) ధర కంటే రూ. 5 లక్షలు తక్కువ.
టైరాన్ ఆర్-లైన్ ఏడు సీట్ల వాహనం. అయితే టైరాన్ లైఫ్ ఐదు సీట్ల మోడల్. దీని అల్లాయ్ వీల్స్ ఆర్ లైన్ కంటే కొంత చిన్నగా ఉంటాయి. డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అప్‌హోల్స్టరీ ఉంటుంది. కానీ డోర్, స్టీరింగ్ వీల్‌పై ఉండే 'R' బ్యాడ్జ్‌లు లేవు. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆర్-లైన్‌లోని 15-అంగుళాల డిస్‌ప్లేకు బదులుగా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 12.9-అంగుళాల యూనిట్ ఉంది. ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్ లభిస్తుంది. వెనుక లోగోలు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.
టైరాన్ లైఫ్ కూడా 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 201bhp పవర్ 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారును కూడా కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.
ఇదీ చదవండి: 2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు


