భారీ ఉద్యోగాల కోతపై జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తీవ్ర విమర్శ లెదుర్కొంటోంది. లక్ష ఉద్యోగాల కోతపై బోర్డు యోచిస్తోందన్న వార్తదావాలనంలా వ్యాపించింది. దీంతో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.
వోక్స్‌వ్యాగన్ తన చరిత్రలోనే అతిపెద్ద పునర్నిర్మాణంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్ష వరకు ఉద్యోగాలను తగ్గించడంతో పాటు, జర్మనీలోని నాలుగు ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దీంతో ఉద్యోగల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తప్పదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వ్యయ ఒత్తిళ్లు, ప్రపంచ పోటీని కారణంగా చూపుతూ కొన్ని జర్మన్ కంపెనీలు తమ కార్యకలాపాలలోని కొన్ని భాగాలను విదేశాలకు తరలిస్తున్నాయి.

ఉద్యోగ కోతలపై భారీ నిరసనల మధ్య వోక్స్‌వ్యాగన్ బోర్డు సమావేశం జరిగింది. హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్, మరియు ఆడికి చెందిన నెకార్సుల్మ్ అనే నాలుగు ప్లాంట్లను మూసివేసి, ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో సుమారు 16 శాతానికి సమానమైన లక్ష ఉద్యోగాలను తొలగించే పునర్నిర్మాణ ప్రణాళికపై చర్చించడానికి వోక్స్‌వ్యాగన్ పర్యవేక్షక బోర్డు వోల్ఫ్స్‌బర్గ్‌లో సమావేశమైంది. డజనుకు పైగా సైట్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా, మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తలెత్తుతుందని ఐజీ మెటల్ హెచ్చరించింది. అధిక ఖర్చులు, తక్కువగా వినియోగమవుతున్న సామర్థ్యం, చైనా, అమెరికా సుంకాల నుండి ఎదురయ్యే పోటీపరమైన ముప్పులను పరిష్కరించడానికి ఈ చర్యలు అవసరమని సీఈఓ ఆలివర్ బ్లూమ్ వాదిస్తున్నారు.


