2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు | 2026 Tata Harrier Safari Stealth Edition Launched In India | Sakshi
Sakshi News home page

2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు

Jul 10 2026 1:21 PM | Updated on Jul 10 2026 1:37 PM

2026 Tata Harrier Safari Stealth Edition Launched In India

టాటా మోటార్స్ భారతదేశంలో 2026 హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. టాప్ స్పెక్ ఫియర్‌లెస్ అల్ట్రా, అకంప్లిష్డ్ అల్ట్రా ట్రిమ్‌ల ఆధారంగా రూపొందిన ఈ కార్లు..కాస్మెటిక్ అప్‌డేట్‌లు పొందుతాయి. కాబట్టి ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2026 టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 23.43 లక్షల నుంచి రూ. 26.01 లక్షల మధ్య ఉండగా.. సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 24.09 లక్షల నుంచి రూ. 26.76 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

ఈ కార్లలో అత్యంత స్పష్టంగా కనిపించే అప్‌డేట్.. స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్. ఈ రెండు SUVలకు మ్యాట్ స్టెల్త్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. ఇవి వాటిని డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్‌ల నుంచి ప్రత్యేకంగా అనిపించేలా చేస్తాయి. ఫ్రంట్ ఫెండర్లపైన ఉంచిన 'స్టీల్త్' బ్యాడ్జ్ ఒక స్పష్టమైన మార్పు. ఇవి కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉండటం చూడవచ్చు.

రెండు SUVలు నలుపు రంగు క్యాబిన్ థీమ్‌ను పొందుతాయి. సీట్లు కార్బన్ నోయిర్ లెదరెట్‌తో తయారు చేసారు. సెంటర్ కన్సోల్‌ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాగా ఇతర ఫీచర్స్ దాదాపు సాధారణ హారియర్, సఫారీలో ఉన్నట్లే ఉన్నాయి.

మెకానికల్‌గా.. స్టెల్త్ ఎడిషన్‌లలో ఎలాంటి మార్పులు లేవు. హారియర్, సఫారీలలో 170 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్, 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందించే 2.0 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా యథావిధిగా ఉన్నాయి, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో టెక్టన్.. ధర, ఫీచర్లు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement