కార్ల అమ్మకాల రికార్డ్‌ | June Monthly Car Sales at 4 Lakh Units | Sakshi
Sakshi News home page

కార్ల అమ్మకాల రికార్డ్‌

Jul 2 2026 4:24 AM | Updated on Jul 2 2026 4:24 AM

June Monthly Car Sales at 4 Lakh Units

జూన్‌లో నాలుగు లక్షల వాహన విక్రయాలు 

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (కార్ల) అమ్మకాలు ఈ ఏడాది జూన్‌ నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా దిగ్గజ కంపెనీల అద్భుత ప్రదర్శనతో మొత్తం విక్రయాలు దాదాపు 25 శాతం వృద్ధితో 4 లక్షల యూనిట్లకు చేరినట్లు అంచనా. జీఎస్‌టీ 2.0 అనుకూలత, రూ.12 లక్షల వరకు ఐటీ మినహాయింపులు, ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు వంటి అంశాలు మార్కెట్‌లో డిమాండ్‌ను భారీగా పెంచాయి.

అయితే, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, ఇంధన ధరల భారం, దేశంలో రుతుపవనాల లోటు వంటి ప్రతికూలతలు భవిష్యత్తు డిమాండ్‌పై కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్‌ భారాన్ని తట్టుకోవడానికి కస్టమర్లు సీఎన్‌జీ, ఈవీల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. రాబోయే పండుగల సీజన్‌ నాటికి ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే అంతర్జాతీయ ఉద్రిక్తతలు అదుపులోకి రావడం, వర్షాలు సమృద్ధిగా కురవడం అత్యంత కీలకమని ఆటో 
పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement