మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. బంపర్‌ డిస్కౌంట్లు | Maruti Suzuki Offers August 2026 Invicto, Grand Vitara, Baleno Discounts | Sakshi
Sakshi News home page

మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. బంపర్‌ డిస్కౌంట్లు

Aug 13 2026 10:36 AM | Updated on Aug 13 2026 10:52 AM

Maruti Suzuki Offers August 2026 Invicto, Grand Vitara, Baleno Discounts

మారుతి సుజుకి నెక్సా కార్ల కొనుగోలుదారులకు ఆగస్టు 2026లో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, సంస్థాగత ప్రయోజనాలు వంటి వాటిని కలిపి కొన్ని మోడళ్లపై భారీగా ప్రయోజనాలు అందిస్తోంది. ఈ నెలలో అత్యధికంగా మారుతి సుజుకి ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. అయితే అన్ని ఆఫర్లు ప్రతి కస్టమర్‌కు ఒకేలా వర్తించవు. నగరం, డీలర్, వాహనం వేరియంట్, స్టాక్, ఎక్స్ఛేంజ్ వాహనం వయసు వంటి అంశాలపై తుది ఆఫర్ ఆధారపడి ఉంటుంది.

ఇన్విక్టోపై రూ.1.55 లక్షల వరకు..

నెక్సా శ్రేణిలో అత్యధిక ప్రయోజనం ఇన్విక్టోపై లభిస్తోంది. ఈ ప్రీమియం ఎమ్‌పీవీపై రూ.55,000 కన్జ్యూమర్ ఆఫర్‌తో పాటు అర్హతను బట్టి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.50,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.30,000 లాయల్టీ అప్‌గ్రేడ్, రూ.20,000 ఇన్‌స్టిట్యూషనల్ డిస్కౌంట్ ఉన్నాయి. మొత్తం ప్రయోజనం రూ.1.55 లక్షల వరకు చేరుతుంది. ఇన్విక్టో ఎక్స్‌షోరూమ్ ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉంది. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు ప్రత్యర్థిగా నిలుస్తోంది.

గ్రాండ్ విటారాపై భారీ బెనిఫిట్స్

ఆగస్టు ఆఫర్లలో గ్రాండ్ విటారా కూడా కీలకంగా ఉంది. సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు ప్రయోజనం, డెల్టా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. జీటా, ఆల్ఫా, ఏడబ్ల్యూడీ వేరియంట్లకు రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్‌తో పాటు ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తున్నారు.

స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారాకు రూ.1.25 లక్షల వరకు ఇతర ప్రయోజనాలతో పాటు ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఢిల్లీలో రోడ్ ట్యాక్స్ మినహాయింపు ద్వారా గరిష్ఠంగా మరో రూ.1.85 లక్షల వరకు ప్రయోజనం లభించవచ్చు.

సీఎన్‌జీ గ్రాండ్ విటారా విషయానికి వస్తే డెల్టా సీఎన్‌జీపై రూ.1.05 లక్షల వరకు, జీటా సీఎన్‌జీపై రూ.95,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. గ్రాండ్ విటారా ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి మోడళ్లతో పోటీపడుతోంది.

XL6పై రూ.50,000 వరకు..

ప్రీమియం ఆరు సీట్ల ఎమ్‌పీవీ XL6 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.50,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇందులో రూ.20,000 కన్జ్యూమర్ ఆఫర్, అర్హతను బట్టి రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.15,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది.

జిమ్నీపై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్

ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ జిమ్నీపై అన్ని వేరియంట్లకు రూ.35,000 కన్జ్యూమర్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ నెల స్కీమ్‌లో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ లేదా సంస్థాగత బోనస్‌లు లేవు. జిమ్నీ ధర రూ.12.39 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది. ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి మోడళ్లకు పోటీగా కొనసాగుతోంది.

బాలెనోపై రూ.30,000 వరకు..

నెక్సా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో పెట్రోల్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లపై రూ.30,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.10,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్లపై రూ.25,000 వరకు బెనిఫిట్ అందిస్తున్నారు. బాలెనో ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.17 లక్షల వరకు ఉంది.

ఫ్రాంక్స్‌పై రూ.20,000 వరకు..

కాంపాక్ట్ ఎస్‌యూవీ తరహా క్రాసోవర్ ఫ్రాంక్స్‌పై రూ.20,000 వరకు ప్రయోజనం ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లకు రూ.5,000 కన్జ్యూమర్ ఆఫర్‌తో పాటు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇతర పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.15,000 వరకు ప్రయోజనం ఉంది. ఫ్రాంక్స్ ధర రూ.6.85 లక్షల నుంచి రూ.11.84 లక్షల వరకు ఉంది.

కొనుగోలుదారులు గమనించాల్సింది..

ఆగస్టు 2026 నెక్సా ఆఫర్లు ఆగస్టు 4 నుంచి అమల్లో ఉన్నట్లు తాజా డీలర్-స్కీమ్ ఆధారిత సమాచారం చెబుతోంది. అయితే ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ, కార్పొరేట్ ప్రయోజనాలను అన్ని సందర్భాల్లో కలిపి పొందే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాదు, డీలర్ స్టాక్, నగరం, వేరియంట్, కస్టమర్ అర్హత ఆధారంగా తుది డీల్ మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు సమీప నెక్సా డీలర్ వద్ద ఆఫర్ బ్రేకప్, ఎక్స్‌షోరూమ్ ధర, ఇన్సూరెన్స్, ఆర్‌టీఓ, యాక్సెసరీస్ తదితరాల పూర్తి కోట్ తీసుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement