సీఎన్‌జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే! | Maruti Suzuki Targets 9 Lakh CNG Vehicle Sales in FY27 | Sakshi
Sakshi News home page

సీఎన్‌జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!

Jul 27 2026 5:25 PM | Updated on Jul 27 2026 5:27 PM

Maruti Suzuki Targets 9 Lakh CNG Vehicle Sales in FY27

పశ్చిమ ఆసియా సంఘర్షణ తర్వాత.. ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఈ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతుందని మారుతి సుజుకి ఇండియా అంచనా వేస్తోంది.

మారుతి సుజుకి FY27లో సుమారు 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షలకు పైగా యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి సుమారు 2.2 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం పెరుగుదలను సూచిస్తుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.

పశ్చిమ ఆసియా యుద్ధం తర్వాత ఇంధన ధరలు పెరగడం కూడా డిమాండ్ పెరుగుదలకు ఒక కారణమని, దీనివల్ల కొనుగోలుదారులు తక్కువ నిర్వహణ ఖర్చులున్న వాహనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలతో సహా 15 సీఎన్‌జీ మోడళ్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలలో సీఎన్‌జీ వాహనాల వాటా 42 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement