విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా? | Iran Threat Forced Trump To Change Planes In Turkey During NATO Summit | Sakshi
Sakshi News home page

విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా?

Jul 26 2026 4:03 PM | Updated on Jul 26 2026 4:42 PM

Iran Threat Forced Trump To Change Planes In Turkey During NATO Summit

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో తన ప్రయాణ విమానాన్ని అత్యవసరంగా మార్చవలసి వచ్చింది. ఇరాన్ ప్రాక్సీ దళాల నుండి ఆయనకు ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.

ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానంలో ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల రీత్యా తిరిగి వస్తున్నప్పుడు పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించాలని సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను కోరారు. ఈ ముప్పు ప్రత్యేకించి ఖతార్ విమానానికి మాత్రమే కాకుండా, అధ్యక్షుడితో పాటు ఆయన ప్రయాణించే ఏ విమానాన్నైనా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. 

మొదట్లో ఈ విమానం మార్పును వైట్‌హౌస్ సాధారణ విషయంగానే పేర్కొంది. బ్రిటన్‌లోని అమెరికా సైనికులు.. కొత్త విమానాన్ని తిలకించేందుకే తాను విమానం మార్చినట్లు ట్రంప్ బహిరంగంగా తెలిపారు. కానీ.. అసలు కారణం భద్రతా ప్రమాదాలేనని అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉండే అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు లేవు.

ఈ నేపథ్యంలో ఈ విమానం భద్రతపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఈ విమానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు త్వరలో సుమారు ఒక నెలపాటు సర్వీస్ నుంచి తప్పించనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కరెలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అగ్రనేతలకు ముప్పు తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగిందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement