శ్రీను వాసంతి లక్ష్మీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటి పద్మ ప్రియ.
ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో అనేక చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది.
అయితే కెరీర్ మంచి ఫాంలోనే ఉన్నప్పుుడే 2014లో ఆప్ పార్టీకి చెందిన జాస్మిన్ షా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
పెళ్లైన 12 ఏళ్ల తర్వాత ఆమె ఇప్పుడు తల్లైంది. ఈ విషయాన్ని తన బిడ్డ పుట్టిన ఏడాదికి అభిమానులతో పంచుకున్నారు.
తన ఇన్‌స్టా ఖాతాలో రెండు ఫోటోలు షేర్ చేస్తూ ఈ శుభ వార్తను అభిమానులతో పంచుకుంది. అయితే తనకు బాబు పుట్టాడా, లేదా పాప పుట్టిందా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


