రాబోయే ఓనం పండుగ సందర్భంగా.. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్లపైనా ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లకు వర్తిస్తాయి. హ్యారియర్ ఈవీపై గరిష్టంగా రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
టాటా మోటార్స్‌కు ముఖ్యమైన మార్కెట్‌గా ఉన్న కేరళలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓనం ఆఫర్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి, ఈ ఆఫర్లలో నగదు ప్రయోజనాలు, లాయల్టీ ప్రయోజనాలు, బీమా సంబంధిత ఆఫర్ల కలయిక ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 54,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. నెక్సాన్‌పై రూ. 72,500 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్ కారుపై రూ. 77,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన సియెర్రాపై రూ. 30,000 లాయల్టీ ప్రయోజనం లభిస్తుండగా, హారియర్.. సఫారీలు ఒక్కొక్కదానికి రూ. 47,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి.
నెక్సాన్.ఈవీ (Nexon.ev) పై రూ. 60,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్.ఈవీ (Curvv.ev) పై రూ. 55,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఓనం ఆఫర్లు వేరియంట్, డీలర్షిప్ నిబంధనలను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ అందించే ఆఫర్స్ గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించడం మంచిది.


