జియో రీచార్జ్‌: ఇవి టెన్షన్‌ లేని మంత్లీ ప్లాన్లు! | Jio Recharge 319, 339 Monthly Plans 1.5GB Daily Data | Sakshi
Sakshi News home page

జియో రీచార్జ్‌: ఇవి టెన్షన్‌ లేని మంత్లీ ప్లాన్లు!

Aug 10 2026 2:09 PM | Updated on Aug 10 2026 2:19 PM

Jio Recharge 319, 339 Monthly Plans 1.5GB Daily Data

ప్రతి నెలా మొబైల్‌ రీచార్జ్‌ పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లాన్‌లు 28 రోజుల వాలిడిటీతోనే ఉంటాయి. అయితే నెలనెలా రీచార్జ్‌ చేసుకునే వారికి రిలయన్స్‌ జియోకు చెందిన రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఉపయోగకరంగా ఉన్నాయి. రూ.319, రూ.339 ధరలతో లభించే ఈ ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. ముఖ్యంగా వీటికి నెలవారీ సర్వీస్‌ వాలిడిటీ ఉండటం ప్రత్యేకత. అంటే ప్రతి 28 రోజులకు ఒకసారి రీచార్జ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

రూ.319 ప్లాన్‌.. ఏం లభిస్తాయంటే?

జియో రూ.319 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితోపాటు 18 నెలల గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ విలువ రూ.35,100గా కంపెనీ పేర్కొంటోంది. 5,000 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే రోజువారీ డేటా పరిమితి 1.5 జీబీ కావడంతో అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు. జియో టీవీ, జియో ఏఐ లౌడ్‌ వంటి సేవలు కూడా బండిల్‌గా వస్తాయి.

రూ.339 ప్లాన్‌.. అదనంగా టాక్‌టైమ్‌

రూ.339 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లోనూ రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీనికి కూడా నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన టాక్‌టైమ్‌ అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనూ గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, జియో టీవీ, జియో ఏఐ లౌడ్‌ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే 5జీ డేటా ప్రత్యేకంగా అందుబాటులో ఉండదు.

ఈ రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా అన్ని జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు మైజియో యాప్‌ ద్వారా వీటిని రీచార్జ్‌ చేసుకోవచ్చు. తరచూ రీచార్జ్‌ గడువు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నెలవారీ వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement