ఇన్వెస్కో ఇండియా రెండు న్యూ ఫండ్ ఆఫర్స్‌ని ప్రకటించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఆగస్టు 11తో ముగుస్తాయి. అభిషేక్ బాహినిపతి వీటికి ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. తక్కువ ట్రాకింగ్ ఎర్రర్స్‌కి లోబడి దేశీయంగా కీలకమైన లార్జ్ క్యాప్, బ్యాంకింగ్ రంగాల్లో తక్కువ వ్యయాలతో ప్యాసివ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి.
దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో ముడిపడి ఉన్న సెన్సెక్స్‌లోని 30 దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్ ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవహారాలకు కీలకంగా నిల్చే దిగ్గజ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ సహాయకరంగా ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట చేయొచ్చు.
కోటక్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఎఫ్‌వోఎఫ్
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ కొత్తగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌వో ఆగస్టు 19తో ముగుస్తుంది. ఇది వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా యాక్టివ్, ప్యాసివ్ ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకే సాధనంతో పెట్టుబడుల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం, తద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యం. ఇందులో కనీసం రూ. 1,000 నుంచి, సిప్ విధానంలో రూ. 500 నుంచి (కనీసం రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు) ఇన్వెస్ట్ చేయొచ్చు.


