బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌ | Bank of Baroda Golden Goal FD Scheme 7 40 percent interest 555 day deposit | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌

Jun 22 2026 2:06 PM | Updated on Jun 22 2026 2:24 PM

Bank of Baroda Golden Goal FD Scheme 7 40 percent interest 555 day deposit

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) కొత్తగా ‘గోల్డెన్‌ గోల్‌ డిపాజిట్‌ స్కీమ్‌’ని ప్రవేశపెట్టింది. దీని కింద 555 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వార్షికంగా 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తోంది. సాధారణ పౌరులకు 6.75 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ. 3 కోట్ల లోపు రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.

కోటక్‌ ఇన్ఫినిటీ లాంగ్‌ షార్ట్‌ సిఫ్‌..  
కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌) విభాగంలో ఇని్ఫనిటీ లాంగ్‌ షార్ట్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ జూన్‌ 29తో ముగుస్తుంది. సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్, అధునాతన పీఎంఎస్, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌)కి మధ్య అంతరాన్ని భర్తీ చేసేలా సిఫ్‌ కేటగిరీ ఫండ్స్‌ ఉంటాయి.

ఇన్ఫినిటీ హైబ్రిడ్‌ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌.. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ, నిర్దిష్ట డెరివేటివ్‌ వ్యూహాలను ఉపయోగిస్తూ, ఆర్బిట్రేజ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మెరుగైన రాబడులను అందించే విధంగా ఉంటుందని ఫండ్‌ మేనేజర్‌ కల్పేష్‌ జైన్‌ తెలిపారు. ఒడిదుడుకుల పరిస్థితుల్లో నష్టాల రిస్కులను తగ్గిస్తూ, మార్కెట్‌ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఇది పని చేస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement