ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఏఐ.. ఆటోమేషన్ వల్ల చాలా పనులు సులభంగా మారుతున్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి కేవలం అనుభవం మాత్రమే సరిపోదు. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా చాలా ముఖ్యం.
ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కంటే.. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే వ్యక్తులకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని విద్యావేత్త, రచయిత ప్రశాంత్ కిరాడ్ పేర్కొన్నారు. దీనికి కారణం.. స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండటమే అని వెల్లడించారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరం అని ఆయన అన్నారు.

ఉద్యోగ ప్రపంచంలో మనగలగాలంటే.. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? అని మాత్రమే కాకుండా.. అవసరం వచ్చినప్పుడు కొత్త స్కిల్ ఎంత వేగంగా నేర్చుకోగలను అనే విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచించాలి.
అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త స్కిల్ నేర్చుకున్న వెంటనే రిజల్ట్స్ రావాలని ఆశించకూడదు. కనీసం 90 రోజుల పాటు ప్రతిరోజూ ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత అది మనకు ఉపయోగపడుతుందా లేదా అని నిర్ణయించుకోవాలి. ప్రపంచం మారుతున్నప్పుడు.. మనం కూడా మారాలి.
ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్!


