జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మెజెస్టర్ ధరలను సవరించింది. మే నెలలో లాంచ్ అయిన ఈ కారు ధరలను కంపెనీ పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్‌లకు (ఆరు-సీటర్, ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్‌లకు) వర్తిస్తుంది.
ధరలు ఇప్పుడు రూ.1.50 లక్షల వరకు పెరిగాయి. దీంతో ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.49 లక్షలకు (గతంలో ఈ కారు ధర రూ. 40.99 లక్షలు) చేరింది. అయితే, టాప్ స్పెక్ సావీ 4డబ్ల్యుడీ వేరియంట్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 44.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్దే ఉంది.
కంపెనీ మెజెస్టర్ ధరలను పెంచింది. కానీ కారులో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. కాబట్టి అదే పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్‌లు, 12-స్పీకర్ల JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్‌లు, 220-వోల్ట్ పవర్ అవుట్‌లెట్, ముందు సీట్లకు వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫంక్షన్, లెవెల్ 2 ADAS, మరియు 360-డిగ్రీల HD కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 212 బీహెచ్పీ పవర్, 478.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. 4WD వేరియంట్‌లో MG యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, 10 ఆఫ్-రోడ్ మోడ్‌లు లభిస్తాయి.
ఎంజీ మెజెస్టర్ దేశీయ మార్కెట్లో.. జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్, వోక్స్‌వ్యాగన్ టేరాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. కియా సోరెంటోలకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.


