గౌరవ్ గుప్తా డిజైన్‌తో.. స్పెషల్ కార్లు! | MG Cyberster and M9 Couture Editions Unveiled | Sakshi
Sakshi News home page

గౌరవ్ గుప్తా డిజైన్‌తో.. స్పెషల్ కార్లు!

Jul 20 2026 8:09 PM | Updated on Jul 20 2026 8:34 PM

MG Cyberster and M9 Couture Editions Unveiled

ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా సహకారంతో రూపొందించిన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్, ఎమ్9 లగ్జరీ ఎంపీవీ 'కౌచర్ ఎడిషన్ల'ను ఎంజీ మోటార్ కంపెనీ ఆవిష్కరించింది. ఇవి మార్కెట్లో పరిమిత సంఖ్యలో (50 యూనిట్లు) మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి సంస్థ వీటికోసం ప్రీ-రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధరలు ఆగస్టు 3న వెల్లడించనున్నారు.

ఈ స్పెషల్ ఎడిషన్స్ స్టాండర్డ్ సైబర్‌స్టర్, ఎమ్9 ఆధారంగా రూపొందించారు. కానీ కాస్మొటిక్ డిజైన్ మాత్రమే గౌరవ్ గుప్తా చేసారు. ఈ థీమ్‌ను రెండు వాహనాలలోనూ ఎంబ్రాయిడరీ, టోనల్ ఫినిషింగ్‌లు చూడవచ్చు.

డిజైన్ పరంగా మార్పులు కనిపించినప్పటికీ.. ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి సైబర్‌స్టర్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ను అలాగే నిలుపుకుంటుంది. తద్వారా 528 bhp పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ 580 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని. ఇక ఎంజీ ఎమ్9 విషయానికి వస్తే.. ఇందులో కూడా ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి అదే 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ 548 కిమీ రేంజ్ అందిస్తుంది. పనితీరులో కూడా ఎలాంటి మార్పు లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement