సినీ తారలు బయటకు వచ్చినప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే..కొంతమంది వల్ల వారికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పబ్లిక్ వేదికగా వారితో దురుసుగా ప్రవర్తిన్నారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ వారిని అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక భుజాలపై బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ చేతులు వేయడంతో ఆమె అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇలాంటి ఘటననే నటి అనన్య పాండేకి ఎదురైంది.
తాజాగా ఆమె ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నిర్వహించిన ఫ్యాషన్ షోకి షోస్టాపర్‌గా వెళ్లి..ర్యాంప్ వాక్ చేసి అలరించింది. షో ముగిసిన తర్వాత ఆమె గౌరవ్ గుప్తాతో కలిసి వేదికపైకి వచ్చి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే, ఈ సమయంలో అతను ఆ నటితో కాస్త చనువుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించాడు. అతను అనన్య నడుముపై చేతులు వేసి..గిల్లాడు కూడా. అతను అలా చేయడంతో అనన్య అసౌకర్యానికి గురైంది.
అయితే స్టేజ్‌పై ఉండడంతో నవ్వుతూ..పక్కకు తప్పుకొని గౌరవ్‌ని అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్స్ గౌరవ్ వ్యవహరించిన తీరుని తప్పుపడుతూ అనన్యకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది అయితే.. గౌరవ్ సరదాగా అలా చేశాడని.. వారిద్ధరి మధ్య మంచి స్నేహబంధం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Bro, what's going on with Ananya Panday? Is it flirting or harassment? pic.twitter.com/hePI7vZtYt
— Aditya (@Warlock_Aditya) July 18, 2026


