రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా కనిపించనుంది.
ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. విజయ్‌తో సరసన స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఫుల్ యాక్షన్ మూవీగా వస్తోన్న రౌడీ జనార్ధనలో ఈ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ హైలెట్‌గా ఉండనున్నాయి. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది.


