తెలుగు పల్లె సంస్కృతిలో జానపద పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ ప్రజల జీవన విధానం, ప్రేమ, అనుబంధాలు, బాధలు, భావోద్వేగాలు ఈ పాటల్లో ప్రతిబింబిస్తాయి. కాలం మారుతున్నా జానపద గీతాలపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా నిదర్శనంగా “ప్రమీల” జానపద పాట నిలుస్తోంది.
పల్లె జీవనాన్ని, ప్రేమలోని స్వచ్ఛతను, మనసులో దాగిన భావాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. శ్రోతల నుంచి భారీ స్పందన అందుకుంటున్న ఈ గీతానికి ఏకంగా 47 మిలియన్లకు పైగా వీక్షణలు (4 కోట్ల 70 లక్షల వ్యూస్) రావడం విశేషం.
“ప్రమీల” జానపద పాట ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకున్న పల్లె గేయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో ప్రేమికుల మధ్య ఉన్న అనురాగం, ఒకరినొకరు కలుసుకోవాలనే ఆరాటం, దూరం వల్ల కలిగే వేదనను హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు.
ప్రమీల అనే యువతి, ఆమెను ప్రేమించే యువకుడు ఒకరినొకరు కలుసుకోవాలని కోరుకుంటారు. కానీ వారి మధ్య ఉన్న పరిస్థితులు, దూరాలు, కుటుంబ పరిమితులు వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. ప్రమీలను చూడాలని, తన ప్రేమను వ్యక్తం చేయాలని యువకుడు తపన పడుతుంటాడు. మరోవైపు ప్రమీల కూడా తన మనసులోని ప్రేమను దాచుకోలేక భావోద్వేగానికి లోనవుతుంది.
ఈ పాటలోని పల్లె వాతావరణం, సహజమైన పదాలు, ప్రేమలోని స్వచ్ఛమైన భావాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అందుకే “ప్రమీల” జానపద గీతం తరాలు దాటుతూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
(పాట కోసం ఇక్కడ కీక్ చేయండి)


