విజయ్ హీరోగా వస్తోన్న చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది.
ఇప్పటికే జన నాయగన్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో జన నాయగన్ దూసుకెళ్తోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 95 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు.
కేవలం ఒక్క తమిళనాడులోనే ఒక్క రోజే 12 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. కేరళలో ఏకంగా 83 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. కేరళలో కేవలం 17 నిమిషాల్లో పదివేల టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో కోలీవుడ్ కంటే మలయాళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండడం మరో విశేషం. ఈ డిమాండ్ చూస్తుంటే జన నాయగన్ పట్ల ఉన్న భారీ క్రేజ్ అర్థమవుతోంది. ఇవాల్టి నుంచి మరిన్ని రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవనున్నాయి.
GAME ON — 🫰🔥#JanaNayagan sold 12,000+ Tickets at Tamilnadu Box-office from it's very limited shows ( 71** ) ✊💥
Real-time Pre-sales 22.43 Lakhs & Counting*** 📈💥
More shows will open in coming hours, Stay tuned for Real-time updates 📌#ThalapathyVijay𓃵… pic.twitter.com/kwxzaSgyeM— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026
83000+ Tickets sold for #JanaNayagan at Kerala Box-office within just 18 Hours after bookings opened ✊💥
Real-time Pre-sales touched 1.40 CRORES Mark as more shows will open in coming days 📈
Total Ww opening day advances gone past 13.25 Crores 🙏🔥
Just 4 More days to go 🔜… pic.twitter.com/rzClqQv5Oh— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026


