మైత్రి చేతికి రా అండ్‌ రస్టిక్‌ ‘మండాడి’.. రిలీజ్‌ ఎప్పుడంటే..? | Mandadi Release Date Locked, Suhas And Soori's Action Drama Hits Screens On This Date, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

మైత్రి చేతికి రా అండ్‌ రస్టిక్‌ ‘మండాడి’.. రిలీజ్‌ ఎప్పుడంటే..?

Jul 19 2026 2:31 PM | Updated on Jul 19 2026 4:26 PM

Mythri Movie Makers To Release Mandaadi In Telugu

సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’. ఈ రా అండ్‌ రస్టిక్‌ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.

ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement