బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..! | Nandamuri Balakrishna Koratala Siva Latest Movie May Be Titled As Carpenter, Deets Inside | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..!

Jul 19 2026 1:09 PM | Updated on Jul 19 2026 4:54 PM

Nandamuri Balakrishna koratala siva Latest Movie Title goes Viral

నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఫుల్ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారు. యాక్షన్‌తో పాటు సామాజిక కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య మూవీ టైటిల్‌పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో సినిమా టైటిల్‌ టాలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.

ఈ చిత్రానికి కార్పెంటర్ ‍అనే టైటిల్ పరిశీలిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ పేరును ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ టైటిల్ పెడితే సామాజిక కోణంలో కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో సోషల్ మేసేజ్‌తో పాటు ఫుల్ యాక్షన్‌ ట్రీట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.

ఇక వచ్చేనెల  చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్‌లో బాలయ్యపై భారీ యాక్షన్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ విషయంలో కొరటాల శివ భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement