వైజాగ్ కుర్రాడు ప్రిన్స్ పెళ్లికి రెడీ అయ్యాడు. తెలుగులో బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్‌బాస్ తొలి సీజన్‌లోనూ పాల్గొన్న ప్రిన్స్.. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్నాడు.
(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)
గత నెల ప్రారంభంలోనే సాయి మాచిరాజు అనే అమ్మాయితో ప్రిన్స్ నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఓ ఇంటివాడిని కాబోతున్న సంగతి బయటపెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఓ ఫ్రెండ్ పెళ్లి తామిద్దరం కలుసుకున్నామని అలా స్నేహితులం అయ్యామని చెప్పాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రిన్స్‌ని చేసుకోబోయే సాయి మాచిరాజు కుటుంబం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఈమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 24వ తేదీన పెళ్లి కూడా న్యూజిలాండ్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్ నటుడు ప్రియదర్శి. తాజాగా ప్రిన్స్ తాను ప్రపోజ్ చేసిన వీడియోని పోస్ట్ చేయగా అందులో ప్రియదర్శితో పాటు ఇరువురి సన్నిహితులు కూడా కనిపించారు.
(ఇదీ చదవండి: విదేశీయుడిని పెళ్లి చేసుకున్న హిందీ సీరియల్ నటి)


