విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ నటి | Serial Actress Jennifer Winget Marries Singapore Businessman William Ismail, Shares Official Wedding Video Went Viral | Sakshi
Sakshi News home page

Jennifer Winget: సింగపూర్ బిజినెస్‌మ్యాన్‌తో నటి పెళ్లి.. వీడియో పోస్ట్

Jul 18 2026 9:03 PM | Updated on Jul 19 2026 11:10 AM

Serial Actress Jennifer Winget Wedding

మన దేశంలో సినిమాల కంటే సీరియల్స్‌కే క్రేజ్ ఎక్కువ. అందుకు తగ్గట్లే వాటిలో నటించేవాళ్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలా భారతీయ టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో హిందీ నటి జెన్నిఫర్ వింగెట్ ఒకరు. 'కసౌటీ జిందగీ కే', 'సరస్వతీ చంద్ర', 'బేహద్', 'బేపన్నా', 'కోడ్ ఎం' తదితర సీరియల్స్‌తో ఈమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడీమె రెండో పెళ్లి చేసుకుని అభిమానులని సర్‌ప్రైజ్ చేసింది.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

జెన్నిఫర్ గతంలో 'దిల్ మిల్ గయే' సీరియల్ చేసింది. ఇందులో నటిస్తున్న టైంలోనే సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ని ప్రేమించింది. 2012లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో రెండేళ్లకే అంటే 2014లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న జెన్నిఫర్ గురించి కొన్నాళ్ల ముందు మళ్లీపెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఈమె స్పందించలేదు. దీంతో అవి పుకార్లు మాత్రమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా తన వివాహం గురించి ప్రకటన చేసింది.

గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పెడుతూ జెన్నిఫర్ వింగెట్.. తన పెళ్లి వీడియోని షేర్ చేసింది. సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్‌ని తన భర్తగా పరిచయం చేస్తూ వివాహం సంగతి అధికారికంగా ప్రకటించింది. యూకేలోని ఓ చర్చిలో సన్నిహితుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది.

నూతన దంపతులుగా మొదటిసారి కలిసి నడవడం, ఉంగరాలు మార్చుకోవడం, తొలి ముద్దు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలను ఆస్వాదించడం లాంటి మధుర క్షణాలని ఈ వీడియోలో పంచుకుంది.  ఇక జెన్నిఫర్ పెళ్లి గురించి పోస్ట్ పెట్టడంతో సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement