1982 జులై 18న బీహార్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించారు.
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా 'మిస్ వరల్డ్’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
2002లో విజయ్ సరసన 'తమిజన్' అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.
2003లో వచ్చిన 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై' సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు..
'ఫ్యాషన్'(2008) సినిమాకుగానూ ఉత్తమ నటిగా 'జాతీయ చలనచిత్ర అవార్డు' అందుకున్నారు.
అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన మొదటి దక్షిణాసియా నటిగా ప్రియాంక రికార్డు
కళారంగంలో ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 2016 లో 'పద్మశ్రీ'తో ఆమెను సత్కరించింది.
2018 డిసెంబర్‌లో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా 'మాలతీ మేరీ చోప్రా జోనాస్' అనే కుమార్తె జన్మించింది.
ప్రియాంక కేవలం నటి మాత్రమే కాదు, విజయవంతమైన బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు 'అనోమలి' అనే హెయిర్ కేర్ బ్రాండ్ ఉంది.


