నోట్ల ముద్రణ ప్రైవేట్‌ పరం?.. అఖిలేష్ సంచలన ఆరోపణలు! | Akhilesh Yadav Questions Centre over Currency Note Material Tender | Sakshi
Sakshi News home page

నోట్ల ముద్రణ ప్రైవేట్‌ పరం?.. అఖిలేష్ సంచలన ఆరోపణలు!

Jul 18 2026 11:36 AM | Updated on Jul 18 2026 11:42 AM

Akhilesh Yadav Questions Centre over Currency Note Material Tender

లక్నో: దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణను  ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఒక టెండర్ నోటీసును అఖిలేష్ యాదవ్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.

నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక పాలీమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటీసుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ‘భ్రష్ట బీజేపీ పాలనలో ఇప్పుడు కరెన్సీ నోట్ల ప్రైవేటీకరణ కూడా జరగబోతోందా?’ అని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ పరంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోతే, దేశం ఎలా ఆత్మనిర్భర్ భారత్‌గా మారుతుందని ఆయన నిలదీశారు.
 

బీజేపీ ప్రభుత్వం పాలకుల వలె కాకుండా, లాభాపేక్ష కలిగిన వ్యాపారుల భాగస్వామిగా వ్యవహరిస్తోందని, ఈ టెండర్ ప్రక్రియ కేవలం నామమాత్రపు లాంఛనం మాత్రమేనని అఖిలేష్ ఆరోపించారు. కాగా, ఈ టెండర్లకు సంబంధించిన బిడ్లు ఆగస్టు 18న తెరవనున్నారు. కరెన్సీ వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement