ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక | Aamir Khan Receives Threat From Lawrence Bishnois Brother Over Love Jihad Remarks In Viral Audio Clip, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక

Jul 18 2026 10:53 AM | Updated on Jul 18 2026 11:18 AM

Aamir Khan receives threat from Lawrence Bishnois brother over love jihad remarks

ముంబై: ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఆర్జూ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘లవ్ జిహాద్’ అంశంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొంటూ ఆయనను ఆర్జూ బిష్ణోయ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్,  ఆడియో క్లిప్ వైరల్‌గా మారాయి.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ‘లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే ఆమీర్ ఖాన్ వంటి వారిని సహించేది లేదు. ఆయన చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ బుద్ధి చెబుతాం’ అని ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు.

సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా అదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. శ్రీగంగానగర్‌లో జరిగిన ఒక ఘటనలో నిందితులకు రాజకీయ నేతలు అండగా ఉండటంపై కూడా ఆర్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్, సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రామాణికతను ధృవీకరించలేమని ‘ఇండియా టుడే’ పేర్కొంది. ఏదేమైనా ఈ పరిణామం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: ‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement