సోనమ్ వాంగ్‌చుక్‌కు '3 ఇడియట్స్‌'తో సంబంధం లేదు | Aamir Khan Reacts Sonam Wangchuk And 3 Idiots Movie Connection Video Went Viral, Says Makers Didnt Know Him During Filming | Sakshi
Sakshi News home page

Aamir Khan Sonam Wangchuk: ఆమిర్ ఖాన్.. ఇలా షాకిచ్చాడేంటి?

Jul 17 2026 9:17 AM | Updated on Jul 17 2026 10:28 AM

Aamir Khan Reacts Sonam Wangchuk And 3 Idiots Movie Connection

కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్నిరోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తోంది. వీళ్లతో మద్ధతిచ్చిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏకంగా 9 కిలోలకు పైగా బరువు తగ్గిపోవడంతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే చాలామందికి వాంగ్ చుక్ పేరు చెప్పగానే 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తొస్తుంది. ఈయన జీవితం ఆధారంగానే ఆమిర్ పోషించిన పాత్రని తెరకెక్కించారని ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. కానీ వాంగ్ చుక్‌కి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పారు.

(ఇదీ చదవండి: విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!)

బ్రిటన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆమిర్ ఖాన్.. సోనమ్ వాంగ్ చుక్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆయన సురక్షితంగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం త్రీ ఇడియట్స్' మూవీలో నటించిన ఓమి వైద్య.. సోనంకు మద్ధతు ప్రకటిస్తూ.. పున్సుఖ్ వాంగ్డూ పాత్ర ఈయన జీవితం ఆధారంగా తీశారని అన్నాడు.

ఇప్పుడీ విషయం పైనా స్పందించిన ఆమిర్ ఖాన్.. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గానీ, రచయిత అభిజిత్ జోషి గానీ సినిమా తీసే టైంలో సోనం వాంగ్ చుక్ గురించి వ్యక్తిగతంగా ఏం తెలుసుకోలేదు. ఈ మూవీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆరోగ్యం పట్ల అందరం ఆందోళన చెందుతున్నాం. త్వరగా దీక్ష విరమించి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.

సోనం వాంగ్‌చుక్ గతంలో ఇదే విషయమై ఓసారి స్పందిస్తూ, తన జీవితం ఆధారంగా ఆ పాత్ర తీయలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పనితీరు, ఆలోచనల నుంచి కొంతమేర ప్రేరణ పొంది ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్‌కి లక్కీ ఛాన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement