అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నాయి. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘టోంగా టోంగా...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ పాటకు ఎస్.ఎస్. చిరంజన్ సాహిత్యం అందించగా మంగ్లీ పాడారు. మోయిన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ వేడుకకి అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాను. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. వెంకట్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఇందులో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు.
బిక్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తూ తిట్టారు. అయితే సినిమా చూసిన తర్వాత నెగెటివ్ కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఏషియన్ సురేష్ ప్రోడక్షన్స్, బెక్కెం వేణుగోపాల్‌గారి సహకారంతో మా సినిమాకి మరింత బలం చేకూరింది’’ అని వాసవి గణేషన్ తెలిపారు. చరణ్ అర్జున్, నటులు గోవర్థన్, నవీన్, అంజి, కెమెరామేన్ రుద్రసాయి, రచయిత ఎస్.ఎస్.చిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


