తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం | Tollywood hero Kiran Abbavaram Comments telugu movies in Tamilnadu | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: 'ఆ మాటలు నన్ను చాలా బాధించాయి'

Jul 16 2026 9:50 PM | Updated on Jul 16 2026 9:50 PM

Tollywood hero Kiran Abbavaram Comments telugu movies in Tamilnadu

ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.

తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.

మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని  కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement