జిమ్‌లో 'సిల్క్ స్మిత' వర్కవుట్స్.. వీడియో వైరల్ | Silk Smitha Lookalike Video Went Viral On Social Media, Fans Reminisce About The Legendary Actress Decades Later | Sakshi
Sakshi News home page

Silk Smitha: జిమ్‌లో 'సిల్క్ స్మిత' వర్కవుట్స్.. వీడియో వైరల్

Jul 16 2026 8:51 PM | Updated on Jul 17 2026 11:39 AM

A Girl Looks Like Same as Item song Famous actress Silk Smitha

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ ‍అడ్రస్ సిల్క్ స్మిత. అప్పట్లో టాలీవుడ్‌లో ప్రేక్షకుల గుండెల్లో ఐటమ్ గర్ల్‌గా ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్‌ మూవీ నా దేశం చిత్రంలో నేనొక నెత్తురు దీపం సాంగ్‌ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి దాదాపు టాప్‌ హీరోలందరి సినిమాల్లో సిల్క్‌ స్మిత డ్యాన్స్‌  ఉండాల్సిందే అనేంతలా క్రేజ్‌ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్‌ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్‌ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

అదే సమయంలోనే గూండా, ఛాలెంజ్, బాలకృష్ణ ఆదిత్య 369వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా  1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

అయితే మనుషుల పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని మనందరం వింటుంటాం. అదే నిజమో కాదో తెలియదు కానీ.. ఓ అమ్మాయి మాత్రం అచ్చం సిల్క్ స్మితను తలపిస్తోంది. గతంలో అచ్చం సౌందర్యలాగే ఓ అమ్మాయి కనిపించింది. తాజాగా సిల్క్ స్మితను పోలిన ఓ అమ్మాయి జిమ్‌లో సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అచ్చం స్మితలా కాకపోయినా.. ఇంచుమించు అలానే కనిపిస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement