అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు.
సినిమా బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోన్న వేళ.. మేకర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లెనిన్ మూవీ నుంచి ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. బ్లాక్‌బస్టర్ మాషప్ పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అఖిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్పెషల్ వీడియో చూసేయండి.


