పదిహేడేళ్ల తర్వాత... | Haiwaan First Look Posters Out: Akshay Kumar and Saif Ali Khan Look Mysterious And Fierce In Priyadarshan Thriller | Sakshi
Sakshi News home page

పదిహేడేళ్ల తర్వాత...

Jul 17 2026 3:25 AM | Updated on Jul 17 2026 3:25 AM

Haiwaan First Look Posters Out: Akshay Kumar and Saif Ali Khan Look Mysterious And Fierce In Priyadarshan Thriller

అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘హైవాన్‌’. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వెంకట్‌ కె.నారాయణ, శైలజ దేశాయ్‌ ఫెన్‌ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘హైవాన్‌’. ఈ చిత్రంలో ఫస్ట్‌ టైమ్‌ నెగెటివ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు అక్షయ్‌ కుమార్‌.

ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్‌ వరల్డ్‌లోకి తీసుకెళ్లనున్నారు ప్రియదర్శన్‌. ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘హైవాన్‌’ ముందు వరుసలో ఉంటుంది. అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ 17 ఏళ్ల తర్వాత ‘హైవాన్‌’ మూవీలో కలిసి నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement