బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. హౌస్‌ఫుల్ 5 చిత్రంలోని 'లాల్ పరి' పాటకు తన డ్యాన్స్‌తో మెప్పించారు. అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తోన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫినాలే ఎపిసోడ్‌లో స్టెప్పులతో వేదికపై అలరించారు. అయితే ఈ వేడుకలో హై హీల్స్‌తో అక్షయ్ డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా అక్షయ్ కుమార్ చిన్న పరీక్ష పెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హైహీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఒకవేళ అక్షయ్ డ్యాన్స్ మధ్యలో ఆగిపోతే.. ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలని చిన్న పందెం కాసింది. దీంతో అక్షయ్ హై హీల్స్‌తో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో అక్షయ్‌తో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ సైతం కాలు కదిపారు. ఒక నిమిషం డ్యాన్స్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అక్షయ్‌ను ఫరా ఖాన్ అభినందించారు.
కాగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఫరా ఖాన్, భూమి అతిథులుగా హాజరయ్యారు. హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అక్షయ్ సరదాగా మహిళలకు సెల్యూట్ చేశారు. హైహీల్స్‌లో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తనకు అర్థమైందన్నారు.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే భూత్ బంగ్లా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ 'వెల్కమ్ టు ది జంగిల్' అనే మూవీతో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది.
Akshay dancing in heels wasn’t on my 2026 bingo card… probably not in Akshay Kumar’s plan either 😭 https://t.co/AL7S5ck2s9 pic.twitter.com/6rCnNQOVrm
— PintuX (@pintya_348) April 28, 2026


