రూపాయి ఎక్కువ ఇవ్వలేదని ఆ షో రిజెక్ట్‌ చేశా: సంజీవ్‌ కపూర్‌ | Sanjeev Kapoor Opens Why He Rejected Masterchef India Season 2 | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ కన్నా రూపాయి ఎక్కువ అడిగా, నో అంటే రిజెక్ట్‌ చేశా: సంజీవ్‌ కపూర్‌

Jun 23 2026 6:17 PM | Updated on Jun 23 2026 6:28 PM

Sanjeev Kapoor Opens Why He Rejected Masterchef India Season 2

రెస్టరంట్‌ స్టైల్‌ వంటకాలను టెలివిజన్‌ ద్వారా దేశ మహిళకు పరిచయం చేసిన ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌. 1990ల ప్రారంభంలో తన ఐకానిక్ షో 'ఖానా ఖజానా'తో ఆయన ఫేమస్‌ అయ్యారు. 'మాస్టర్‌ చెఫ్ ఇండియా' రియాల్టీ షోతో ఆయన ప్రజాదరణ మరింత పెరిగింది. ఈ ఫ్రాంచైజీ విజయాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే తొలుత ఈ రియాల్టీ షోని ఆయన రిజెక్ట్‌ చేశాడట. అలా ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

మాస్టర్‌ చెఫ్‌ ఇండియా మొదటి సీజన్‌కు అక్షయ్‌ కుమార్ జడ్జ్‌గా వ్యవహరించారు. రెండో సీజన్‌ కోసం నిర్వాహకులు నన్ను సంప్రదించారు. నేను చేస్తానని చెప్పా. కానీ అక్షయ్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ పారితోషికం ఇస్తేనే చేస్తానని కండీషన్‌ పెట్టాను. దానికి వాళ్లు అంగీకరించలేదు. వాళ్లు చెప్పిన రెమ్యునరేషన్‌కే షో చేయమన్నారు. నేను కుదరని చెప్పా. అది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా అనిపించింది. అందుకే రెండో సీజన్‌ని రిజెక్ట్‌ చేశారు. ఇక మూడో సీజన్‌ సమయంలోనూ వారు నన్ను సంప్రదించారు. షో సరిగా నడవడం లేదని.. నన్ను జడ్జ్‌గా చేయమని అడిగారు. అప్పుడు కూడా నేను అదే కండీషన్‌ పెట్టా. అక్షయ్‌ కుమార్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి..నన్ను ఆ షోకి తీసుకున్నారు’ అని సంజీవ్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement